Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకం భారత్ పార్టీ తరఫున బ్రదర్ షఫీ భాయ్

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 02:03 AM |
Video Thumbnail

ముఖ్యమైన పాయింట్స్:

  • పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం

సూర్యాపేట జిల్లా కేంద్రం:- వరంగల్–ఖమ్మం–నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏకం భారత్ పార్టీ తరఫున అభ్యర్థిగా బ్రదర్ షఫీ భాయ్ పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బ్రదర్ షఫీ భాయ్ మాట్లాడుతూ.. “ఓ యువత మేలుకో.. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కండి” అని యువతకు పిలుపునిచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రశ్నించే స్థాయికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని బ్రదర్ షఫీ భాయ్ కోరారు. విద్యావంతులైన యువత ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనడం ద్వారా ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ 28-09-2026 నుంచి ప్రారంభమై 06-11-2026 వరకు కొనసాగుతుందని, అర్హత కలిగిన పట్టభద్రులు కొత్త ఫారం–18 ద్వారా అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగులు, విద్యావంతుల సమస్యలపై పోరాటం
వరంగల్–ఖమ్మం–నల్గొండ జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉద్యోగులు, విద్యావంతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని బ్రదర్ షఫీ భాయ్ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యావంతుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
“మీ ఓటు.. మీ భవిష్యత్తు”
“మీ ఓటు.. మీ భవిష్యత్తు” అనే నినాదంతో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బ్రదర్ షఫీ భాయ్ కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమైనదని, ప్రతి అర్హుడూ తన హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.