పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకం భారత్ పార్టీ తరఫున బ్రదర్ షఫీ భాయ్
ముఖ్యమైన పాయింట్స్:పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం సూర్యాపేట జిల్లా కేంద్రం:- వరంగల్–ఖమ్మం–నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏకం భారత్ పార్టీ తరఫున అభ్యర్థిగా బ్రదర్ షఫీ భాయ్ పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బ్రదర్ షఫీ భాయ్ మాట్లాడుతూ.. “ఓ యువత మేలుకో.. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కండి” అని యువతకు పిలుపునిచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రశ్నించే స్థాయికి రావాల్సిన...