Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జూరాల మిషన్ భగీరథ తాగునీటిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Author
Posted By Telangana Vaartha
| 03 Oct 2026, 07:15 PM | జోగులాంబ గద్వాల్
జూరాల మిషన్ భగీరథ తాగునీటిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

మిషన్ భగీరథ తాగునీటిని ల్యాబ్‌లో నిరంతరం పరీక్షిస్తున్నాం
నీటిని పరీక్షించి.. నాణ్యత నిర్ధారించి.. ప్రజలకు సరఫరా
మిషన్ భగీరథ గ్రిడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.రవి చంద్ర కుమార్ రెడ్డి

జోగులాంబ గద్వాల3 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. మిషన్ భగీరథ పథకం ద్వారా జూరాల నుంచి జిల్లాలోని ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటిని శుద్ధి ప్రక్రియ అనంతరం నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షించి,నీటి నాణ్యతను నిర్ధారించిన తర్వాతే ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ గద్వాల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.రవి చంద్ర కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాగునీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతూ,ల్యాబొరేటరీలో ప్రతి రెండు గంటలకు ఒకసారి నీటి నమూనాలను పరీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.నిర్వహిస్తున్న పరీక్షల్లో పీ హెచ్,టర్బిడిటీ (నీటి మసకదనం), బ్యాక్టీరియల్ నాణ్యత వంటి ప్రధాన ప్రమాణాల్లో ఎటువంటి ప్రతికూల ఫలితాలు నమోదు కాలేదని తెలిపారు.అయితే, శుద్ధి చేసిన నీరు గ్రామాల్లోని నీటి నిల్వ కేంద్రాలు,పైపులైన్లు మరియు పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరే సమయంలో కూడా నీటి నాణ్యతను కాపాడటం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.అందులో భాగంగా ప్రతి గ్రామంలో నీటిని తప్పనిసరిగా క్లోరినేషన్ చేసిన అనంతరం మాత్రమే ప్రజలకు మరియు ఆవాస ప్రాంతాలకు సరఫరా చేయాలని సంబంధిత గ్రామ పంచాయతీలు, నీటి సరఫరా సిబ్బందికి సూచించారు.ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ,క్లోరినేషన్ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసి,అవసరమైన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించిన అనంతరం మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.జూరాల మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,నీటి నాణ్యతను నిరంతరం పరీక్షిస్తూ,ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. రవి చంద్ర కుమార్ రెడ్డి తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.