జూరాల మిషన్ భగీరథ తాగునీటిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
మిషన్ భగీరథ తాగునీటిని ల్యాబ్లో నిరంతరం పరీక్షిస్తున్నాం నీటిని పరీక్షించి.. నాణ్యత నిర్ధారించి.. ప్రజలకు సరఫరా మిషన్ భగీరథ గ్రిడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.రవి చంద్ర కుమార్ రెడ్డి జోగులాంబ గద్వాల3 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. మిషన్ భగీరథ పథకం ద్వారా జూరాల నుంచి జిల్లాలోని ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటిని శుద్ధి ప్రక్రియ అనంతరం నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షించి,నీటి నాణ్యతను నిర్ధారించిన తర్వాతే ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ గద్వాల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.రవి చంద్ర కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాగునీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతూ,ల్యాబొరేటరీలో...