Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పల్లె రామలింగయ్యకు నివాళులర్పించిన నాయకులు, స్నేహితులు, బంధువులు

Author
Posted By Telangana Vaartha
| 28 Sep 2026, 07:09 PM |
పల్లె రామలింగయ్యకు నివాళులర్పించిన నాయకులు, స్నేహితులు, బంధువులు

ముకుందాపురం :- సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అజాతశత్రువు, అందరితో కలిసి కలివిడిగా ఉంటూ కలుపుకుపోయే తత్వం కల మనసున్న మంచి మనిషి పల్లె రామలింగయ్య ఇటీవల మరణించారు. పల్లె రామలింగయ్య దశదిన కార్యక్రమం ఆదివారం ముకుందాపురం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా దశదిన కార్యక్రమానికి హాజరై పల్లె రామలింగయ్య గారి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన టీఎన్జీవో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దున్న శ్యామ్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్, చిల్లేపల్లి సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ గంగ రంగారెడ్డి, టీజీవో రాష్ట్ర నాయకులు డాక్టర్ గోపి, టీఎన్జీవో సీనియర్ నాయకులు మడి పడగ సైదులు, ముకుందాపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పగిడి నవీన్, మీసాల పిచ్చయ్య, గాజనబోయిన బిక్షం, మచ్చ గోవర్ధన్, పగిడి అఖిల్, బొమ్మకంటి లక్ష్మయ్య, మురళి, కృష్ణ, సైదులు, లకు మల్ల గోపయ్య, వెంకన్న తదితరులు. ఈ సందర్భంగా పల్లె రామలింగయ్య కుమారులు పల్లె సృజన్ కుమార్, పల్లె సంజయ్ కుమార్, సోదరులు పల్లె శంకర్, పల్లె కాశయ్య, పల్లె వెంకన్న తదితరులతోపాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.