పల్లె రామలింగయ్యకు నివాళులర్పించిన నాయకులు, స్నేహితులు, బంధువులు
ముకుందాపురం :- సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అజాతశత్రువు, అందరితో కలిసి కలివిడిగా ఉంటూ కలుపుకుపోయే తత్వం కల మనసున్న మంచి మనిషి పల్లె రామలింగయ్య ఇటీవల మరణించారు. పల్లె రామలింగయ్య దశదిన కార్యక్రమం ఆదివారం ముకుందాపురం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా దశదిన కార్యక్రమానికి హాజరై పల్లె రామలింగయ్య గారి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన టీఎన్జీవో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దున్న శ్యామ్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్, చిల్లేపల్లి సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ గంగ రంగారెడ్డి, టీజీవో రాష్ట్ర నాయకులు...