Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Author
Posted By Telangana Vaartha
| 28 Sep 2026, 01:05 AM |
జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ముఖ్యమైన పాయింట్స్:

  • కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: ఎస్పి నరసింహ

సూర్యాపేట:- స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి నరసింహ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికి, తెలంగాణకు చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దశాబ్దాల పాటు అలుపెరగని కృషి చేశారని తెలిపారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్ఐ జానయ్య, క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ నవీన్, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.