జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ముఖ్యమైన పాయింట్స్:కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: ఎస్పి నరసింహ సూర్యాపేట:- స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి నరసింహ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికి, తెలంగాణకు చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దశాబ్దాల పాటు అలుపెరగని కృషి చేశారని...