🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 1:05 am Posted by : Telangana Vaartha

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: ఎస్పి నరసింహ
సూర్యాపేట:- స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి నరసింహ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికి, తెలంగాణకు చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దశాబ్దాల పాటు అలుపెరగని కృషి చేశారని తెలిపారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్ఐ జానయ్య, క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ నవీన్, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home