Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

Author
Posted By Telangana Vaartha
| 26 Sep 2026, 08:26 PM | హైదరాబాద్
చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

సూర్యపేట చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. భూమి, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఆమె జీవితం మార్గదర్శకమని తెలిపారు. కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధికారులు అందరూ పాల్గొని, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ప్రేమ రాజు జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి డి. విశాల్, డిఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లు రవితేజ, అనూష, డిఐఇఓ సులోచన రాణీ, జీఎం ఇండస్ట్రీస్ భారతి, ఇతర కుల సంఘ సభ్యులు, నాయకులు జిల్లా అధికారులు, ఐడిఒసి సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.