చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం
ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. సూర్యపేట చాకలి ఐలమ్మ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. భూమి, ఆత్మగౌరవం...