Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సమాజానికి పరిశుభ్రమైన పర్యావరణమే పునాది

Author
Posted By Telangana Vaartha
| 26 Sep 2026, 06:03 PM | హైదరాబాద్
సమాజానికి పరిశుభ్రమైన పర్యావరణమే పునాది

సూర్యాపేట:- ఆరోగ్యకరమైన సమాజానికి పరిశుభ్రమైన పర్యావరణమే పునాదని సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. భారతీయ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) పాఠ్య ప్రణాళికలో భాగంగా భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ విద్యార్థులు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి కేంద్రాలను సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.నర్సింగ్ విద్యార్థులకు ఆసుపత్రి సేవలతో పాటు పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ బాధ్యతపై అవగాహన ఎంతో అవసరమని ఆమె తెలిపారు. ఘన వ్యర్థాలను వేరు చేయడం, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి ప్రక్రియలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా క్షేత్రస్థాయి అవగాహన పొందారని పేర్కొన్నారు. తాము నేర్చుకున్న పర్యావరణ పరిరక్షణ అంశాలను సమాజంలో ప్రజలకు కూడా వివరించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ శివ ప్రసాద్ విద్యార్థులకు వివిధ వ్యర్థాల నిర్వహణ విధానాలను వివరించారు. భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మతకల చలపతిరావు ప్రత్యేక చొరవ, మార్గదర్శకత్వంతో ఫీల్డ్ విజిట్ నిర్వహించినట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. తరగతి గది బోధనతో పాటు క్షేత్రస్థాయి అనుభవాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ సారథి, ప్రిన్సిపాల్ కీర్తన, సౌమ్య, జానకి, సిరీష, శైలజ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై ప్రాయోగిక అవగాహన పొందారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.