సమాజానికి పరిశుభ్రమైన పర్యావరణమే పునాది

సూర్యాపేట:- ఆరోగ్యకరమైన సమాజానికి పరిశుభ్రమైన పర్యావరణమే పునాదని సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. భారతీయ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) పాఠ్య ప్రణాళికలో భాగంగా భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ విద్యార్థులు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి కేంద్రాలను సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.నర్సింగ్ విద్యార్థులకు ఆసుపత్రి సేవలతో పాటు పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ బాధ్యతపై అవగాహన ఎంతో అవసరమని ఆమె తెలిపారు. ఘన వ్యర్థాలను వేరు చేయడం, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి ప్రక్రియలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా క్షేత్రస్థాయి అవగాహన పొందారని పేర్కొన్నారు....