Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చాకలి ఐలమ్మ సేవలు విశ్వజనీనం సమాజానికే ఆదర్శం: ఎమ్మెల్యే జారె

Author
Posted By Telangana Vaartha
| 26 Sep 2026, 05:52 PM | భద్రాచలం
చాకలి ఐలమ్మ సేవలు విశ్వజనీనం సమాజానికే ఆదర్శం: ఎమ్మెల్యే జారె

అశ్వారావుపేట :- వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్‌లో ఘనంగా విగ్రహావిష్కరణ చేసిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి పోరాట పటిమ ఆమె సేవలు కేవలం ఒక వర్గానికి లేదా ఒక కులానికి మాత్రమే పరిమితం కాదని ఆమె సమాజం మొత్తానికి ఆదర్శప్రాయురాలని కొనియాడారు మండల రజక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రసంచించారు నాటి నిరంకుశ పాలనకు భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తన భూమి కోసం హక్కుల కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటమే నేడు సామాన్య ప్రజలందరూ ఆత్మగౌరవంతో జీవించడానికి వ్యవసాయం చేసుకోవడానికి అనువైన భూములను పొందడానికి మూలకారణమైందని ఆయన గుర్తుచేశారు ఆమె ఆశయాలు త్యాగం చిరస్మరణీయమని అన్నారు ఆమె వీరత్వానికి సమాజానికి చేసిన సేవలకు దక్కిన గౌరవంగానే నేడు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక మహిళా విశ్వవిద్యాలయానికి (ఉమెన్స్ యూనివర్సిటీ) చాకలి ఐలమ్మ గారి పేరును ప్రభుత్వం కొనసాగిస్తోందని సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు రజకుల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె పుల్లయ్య , తుమ్మ రాంబాబు, మున్సిపాలిటీ కౌన్సెలరు, జిల్లా మండల స్థాయి ముఖ్య నాయకులు వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు….

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.