Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జూరాల ఆర్డీఎస్ నీటిని వెంటనే విడుదల చేయాలి.

Author
Posted By Telangana Vaartha
| 22 Sep 2026, 01:29 PM |
జూరాల ఆర్డీఎస్ నీటిని వెంటనే విడుదల చేయాలి.

ముఖ్యమైన పాయింట్స్:

  • జిల్లా కలెక్టర్ ను కోరిన ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్.

జోగులాంబ గద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో గత కొన్ని రోజులుగా సాగు నీటి కోసం జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఈరోజు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్. ఏ. సంపత్ కుమార్ జిల్లా కలెక్టర్ ను కలిసి అలంపూర్ గద్వాల ప్రాంత రైతులు ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు పడక రైతుల పంటలకు నీరు లేక ఎండిపోయే పరిస్థితీ వచ్చిందని ,జూరాల మరియు ఆర్డీఎస్ నుంచి సాగు నీటిని వెంటనే విడుదల చేసి అలంపూర్ గద్వాల ప్రాంత రైతులను ఆదుకోవాల్సింది కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కొంకల నాగరాజు , అలంపూర్ మార్కెట్ కమిటి చైర్మెన్ దొడ్డప్ప,మాజీ ఎంపీపీ ప్రకాష్ గౌడ్, మాన్ దొడ్డి సర్పంచ్ బాబు రావు తదితరులు హాజరయ్యారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.