Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గద్వాలలో బిజెపి నాయకుల అరెస్ట్ అక్రమం..

Author
Posted By Telangana Vaartha
| 22 Sep 2026, 01:27 PM |
గద్వాలలో బిజెపి నాయకుల అరెస్ట్ అక్రమం..

జోగులాంబ గద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను హౌస్ అరెస్ట్‌ చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు జూరాల డ్యామ్ పర్యటనకు వస్తున్న సందర్భంగా పోలీసులు బిజెపి యువ నాయకురాలు డికె స్నిగ్ద రెడ్డి ని, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు ,బిజెపి నాయకులు వెంకటేశ్వర్ రెడ్డినీ ని ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేశారు..
ఈ సందర్భంగా డికె. స్నిగ్ధ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో పోలీస్‌ల పహారాలు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై అంక్షలు ఎందుకని నిలదీశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.