గద్వాలలో బిజెపి నాయకుల అరెస్ట్ అక్రమం..

జోగులాంబ గద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను హౌస్ అరెస్ట్‌ చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు జూరాల డ్యామ్ పర్యటనకు వస్తున్న సందర్భంగా పోలీసులు బిజెపి యువ నాయకురాలు డికె స్నిగ్ద రెడ్డి ని, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు ,బిజెపి నాయకులు వెంకటేశ్వర్ రెడ్డినీ ని ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేశారు.. ఈ సందర్భంగా డికె. స్నిగ్ధ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో పోలీస్‌ల పహారాలు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై అంక్షలు...