Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

Author
Posted By Telangana Vaartha
| 03 Nov 2026, 12:07 AM | తెలంగాణ Telangana
కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

ముఖ్యమైన పాయింట్స్:

  • టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్ హెచ్చరిక

కవితక్క ఎవరి బాణం కాదని , బహుజనుల బాణం
ఖమ్మం:-
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు , ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీమతి కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన పార్టీ) జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని, ఆ బాధ్యతను కవితక్క తీసుకుని పేద ప్రజలు, ఉద్యోగులు, పీడిత వర్గాల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. కవితక్క ఎవరి బాణం కాదని, బహుజనుల బాణమని అన్నారు. మరోసారి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంజారా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ కిషన్ నాయక్, టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మొరం వీరభద్రరావు, జిల్లా నాయకులు వనం నాగేంద్ర, గుగులోత్ రాజ్ కుమార్, జక్కుల ప్రకాష్ యాదవ్ పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.