🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 November 2026, 12:07 am Posted by : Telangana Vaartha

కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

News Image
ముఖ్యమైన పాయింట్స్:టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్ హెచ్చరిక
కవితక్క ఎవరి బాణం కాదని , బహుజనుల బాణం
ఖమ్మం:- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు , ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీమతి కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన పార్టీ) జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని, ఆ బాధ్యతను కవితక్క తీసుకుని పేద ప్రజలు, ఉద్యోగులు, పీడిత వర్గాల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. కవితక్క ఎవరి బాణం కాదని, బహుజనుల బాణమని అన్నారు. మరోసారి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంజారా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ కిషన్ నాయక్, టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మొరం వీరభద్రరావు, జిల్లా నాయకులు వనం నాగేంద్ర, గుగులోత్ రాజ్ కుమార్, జక్కుల ప్రకాష్ యాదవ్ పాల్గొన్నారు.
🏠 Home