Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజా వాణి ఫిర్యాదులు 01

Author
Posted By Telangana Vaartha
| 02 Nov 2026, 11:41 PM |
ప్రజా వాణి ఫిర్యాదులు 01

జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2026తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల . మండల కేంద్రంలో ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయం నందు నిర్వహించే మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.? ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించాల్సి ఉండగా, కొందరు అధికారులు ప్రారంభ సమయానికి హాజరుకాకుండా ఆలస్యంగా వస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిర్ణీత సమయానికి హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఇటిక్యాల మండల ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో ఇటిక్యాల ఎంపీ ఓ సునీల్,ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ ఓ, శరత్. ఏవో రవికుమార్, ఇటిక్యాల వైద్య ఆరోగ్య సూపర్వైజర్ శేఖర్ ,, ఎక్సేంజ్ సురేష్, ఎలక్ట్రికల్ శ్రీనివాస్, వెటర్నరీ మాసుమన్న, ఇరిగేషన్. తదితరులు ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.