Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

Author
Posted By Kadem Ravi
| 31 Oct 2026, 05:52 PM |
రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్

రామన్నపేట 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత 36వ రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.. కక్కిరేణి గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, రైతుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం జరిగే జాతీయ మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు వేముల సైదులు, కార్యదర్శి కన్నబోయిన యాదయ్య, రైతులు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, శ్రీను, భిక్షం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.