రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
ముఖ్యమైన పాయింట్స్:సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్ రామన్నపేట 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత 36వ రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.. కక్కిరేణి గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, రైతుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం జరిగే జాతీయ మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ...