Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హక్కుదారులం భూమి పట్టాదారులం మేమే

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 09:38 PM | తాజావార్తలు Flash News
హక్కుదారులం భూమి పట్టాదారులం మేమే

తమ భూమి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
అధికారులు స్పందించి న్యాయం చేయాలి
బాధితుల వేడుకోలు
సూర్యాపేట జిల్లా
మా తాతలు,తండ్రులు నుంచి మామిడి చంద్రయ్య, రామయ్య, సోమయ్య, గోపయ్యల నుంచి వారసత్వ భూమి 134, 135 సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల మూడు గంటల భూమి తమ భూమి హక్కు దారుణం పట్టాదారులం మేమేనని తమ పైన పట్టాయిందని తమ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన మామిడి రామయ్య, మామిడి మైసయ్య కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనంతరం గ్రామానికి చెందిన తక్కెలపల్లి వెంకయ్య, సోమయ్య, శ్రీను, గోపయ్య, మామిడి పెద్ద లక్ష్మయ్య, చిన్న లక్ష్మయ్య, మామిడి నాగయ్య, బచ్చలకూరి తిరుమల్, సతీష్ లు తమ భూమిని 2006 నుంచి ఆక్రమించి దౌర్జన్యాన్ని గురి చేస్తున్నారని 2006వ సంవత్సరంలో కోర్టుకెళ్తే 2009లో తమకే చెందాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, 2009 సంవత్సరం లో జిల్లా కలెక్టర్ 13 బి కూడా జారీ చేశారని తెలిపారు. రాజకీయ నాయకుల, రెవిన్యూ అధికారుల అండదండలతో సర్వే చేయించి వచ్చిన పాస్ పుస్తకాలు రాకుండా అడ్డుకుని, బ్లాక్ లిస్టులో పెట్టారని, ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని వారసుల నుంచి కబ్జాలో మేమే ఉన్నామని, తమను భూమిపై రాకుండా అడ్డుకుంటున్నారని, తక్షణమే అధికారులు స్పందించి విచారణ జరిపి భూభారతి ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మామిడి నాగార్జున, మామిడి బాల సైదులు, తదితరులు ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.