Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఉత్తమ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించుకుందాం

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 09:25 PM | తాజావార్తలు Flash News
ఉత్తమ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని మంచి మెజార్టీతో  గెలిపించుకుందాం

ముఖ్యమైన పాయింట్స్:

  • .. తుమ్మల

సుదీర్ఘ చరిత్ర సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను రంగంలోకి దింపిందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడే మేధావులను ఎన్నుకోవాలని పట్టభద్రులకు తుమ్మల పిలుపునిచ్చారు. ఖమ్మం నగరం గాంధీచౌక్ సెంటర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 3 టౌన్ ఏరియా కోఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుమ్మల పాల్గొని మాట్లాడారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి ని పార్టీ గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు విశేష కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు సర్వోత్తమ రెడ్డి మంచి అభ్యర్థిని ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం పట్టబద్రులపై ఉందన్నారు. పట్టభద్రులందరూ సకాలంలో ఓటు నమోదు చేయించుకుని సద్వినియోగం చేసుకోవాలని తుమ్మల కోరారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు ఓటు నమోదు కార్యక్రమాన్ని కీలకంగా భావించి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ డిసిసి అధ్యక్షుడు నాగళ్ళ దీపక్ చౌదరి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా, నాయకులు కమ్మర్తపు మురళి, సాదు రమేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గూడెపు నాగరాజు మరియు కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఉత్తమ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని మంచి మెజార్టీతో  గెలిపించుకుందాం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.