ఉత్తమ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించుకుందాం
ముఖ్యమైన పాయింట్స్:.. తుమ్మల సుదీర్ఘ చరిత్ర సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను రంగంలోకి దింపిందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడే మేధావులను ఎన్నుకోవాలని పట్టభద్రులకు తుమ్మల పిలుపునిచ్చారు. ఖమ్మం నగరం గాంధీచౌక్ సెంటర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 3 టౌన్ ఏరియా కోఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుమ్మల పాల్గొని మాట్లాడారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ...