Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తిరుమలగిరి బస్టాండ్‌లో శ్రమదానం తో అభివృద్ధి చేసిన గ్రామస్తులు..

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 30 Oct 2026, 08:44 PM | తెలంగాణ Telangana
తిరుమలగిరి బస్టాండ్‌లో శ్రమదానం తో అభివృద్ధి చేసిన గ్రామస్తులు..

తిరుమలగిరి 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మున్సిపాలిటీ లోని ప్రయాణ ప్రాంగణంలో రాత్రివేళ రాకపోకలు సాగించే అన్ని బస్సులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో బస్టాండ్ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు రెండు గంటల పాటు శ్రమదానం చేసి, బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయడం జరిగింది. బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు రాత్రివేళ అనేక బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, బస్సుల రాకపోకలకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది.బస్టాండ్ పరిశుభ్రతను కాపాడటం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడటం, ఆర్టీసీ బస్సుల రాకపోకలు సజావుగా సాగేందుకు సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వ వ్యవస్థలపై మాత్రమే ఆధారపడకుండా, ప్రజా అవసరాల కోసం మన వంతు కృషి చేయాలనే సంకల్పంతో శ్రమదానం చేయడం జరిగింది.బస్టాండ్‌ను పరిశుభ్రంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, రాత్రివేళ బస్సుల రాకపోకలు సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. భవిష్యత్తులో కూడా బస్టాండ్ అభివృద్ధి, పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాల కోసం నిరంతరం కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.