Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వైద్యం పేరుతో పేషెంట్ల వద్ద నుండి విచ్చలవిడిగా అధిక మొత్తంలో సొమ్ములు

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:30 PM | తాజావార్తలు Flash News
వైద్యం పేరుతో పేషెంట్ల వద్ద నుండి విచ్చలవిడిగా అధిక మొత్తంలో సొమ్ములు

వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రత్యేక నిఘాఉంచి ప్రభుత్వా లుప్రజలను ఆదుకోవాలి.

తెలంగాణ వార్త అక్టోబర్ 30 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా.అంతంతమాత్రమేఆదాయాల తోఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమవుతున్న ప్రస్తుత పరిస్థితులను అధిగమించడానికి బడుగు బలహీనవర్గాలు, మధ్యతరగతి పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ప్రస్తుత సమాజంలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడలేక ప్రజలు సతమతమవుతున్నారు. కరోనా మొదలగు ప్రకృతి వైఫల్యాలతో ప్రజలు అనేకఇబ్బం దులకు గురైన సంగతి తెలిసినదే, సుమారు సంవత్సర కాలంగాఎల్ ని నో ప్రభావం తో అతివృష్టి అనావృష్టిలమధ్య, పెరుగుతున్న నిత్యావసర సరుకులను అధిక ధరలు పెట్టి కొనలేక మధ్యతరగతి ప్రజలు ఉసూరు మంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫాన్, ఎల్ ని నో ప్రభావంతో కరువు రానున్నదని భయభ్రాంతులవుతున్నప్రజల పైగోరుచుట్టుపై రోకలిపోటు తగిలినట్లుగా, సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులతో ప్రైవేట్ఆస్పత్రులకు వెళుతున్న రోగుల వద్దనుండి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వైద్యుల బండారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ హెచ్చరికలతో రోగుల వద్ద నుండి ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న నిలువుదోపిడీ బహిర్గతమయింది. 11 వేల రూపాయలు విలువ చేసే ఒక ఇంజక్షన్ చేసి 1 లక్ష 30 వేల రూపాయలు రోగి వద్ద నుండి వసూలు చేయడంతో ప్రైవేట్ వైద్యుల బండారం బహిర్గతమయ్యింది. విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు సంబంధిత సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులు చెల్లించలేక తమ ఇబ్బందులు పట్టించుకునే నాధుడు లేక బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు తమ సమస్యలు తీర్చే వారు లేక భగవంతుడిపై భారం వేసి తమ సమస్యలు తీరక జాతస్య మరణం ధ్రువం అనే పరిస్థితులకు చేరుతున్నారు.
ప్రభుత్వాలు ప్రజలందరికి ఉచితంగా విద్య, వైద్యం అందించ లేక పోయినప్పటికీ ఆయాసంస్థలలో ప్రజల వద్ద నుండి చేస్తున్న నిలువు దోపిడీని అరికట్టే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది.
వైద్యానికి ఉపయోగించే మందులు అతి తక్కువ రేట్లతో ఉత్పత్తి అవుతున్న విషయం జగమెరిగిన సత్యమే,
లిక్కర్ షాపుల కంటే అధిక
లాభాలు మెడికల్ షాపుల కు వస్తున్న విషయం తెలిసిన
విషయమే మెడికల్ షాపులలో అమ్ముతున్న మందులు ఎమ్మార్పీ రేట్లకు 25 శాతం తగ్గించి అమ్మినా, మెడికల్ షాపులకు ఆదాయం బాగానే ఉంటుంది.
ఈకారణం గానే తమ మందులు రిఫర్ చేసే
డాక్టర్లకు, అమ్ముతున్నమెడికల్ షాపుల వారికి విదేశీ ప్రయాణాలు, లక్షలాది రూపాయల పారితోషికాలు మందుల ఉత్పత్తి సంస్థల వారు సమర్పిస్తుంటారు.
ఈభారాన్నంతా అధిక ధరలకు మందులు కొనుగోలు చేసే రోగుల రూపంలో ఉన్న ప్రజలు భరించాల్సి వస్తోంది.
కోట్లాదిమంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న
ఈవిషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టి తమ ప్రభుత్వాల ఏర్పాటుకు కారణమైన ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా విద్య, వైద్యం,మద్యం ద్వారా అధిక ఆదాయాలు పొందుతున్న సంస్థలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి అధిక (ధరలు) ఫీజులు వసూలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని కోట్లాదిమంది ప్రజలు కోరుతున్నారు.
ఎండ్

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.