Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:29 PM | తాజావార్తలు Flash News
గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

మల్దకల్ – అయిజ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు
గృహప్రవేశ కార్యక్రమం ముగించుకుని వస్తుండగా జరిగిన ప్రమాదం.
జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. మల్దకల్.– అయిజ ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. మల్దకల్ మండలం శేషంపల్లి స్టేజ్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన కొంతమంది నీలిపల్లిలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరిగి బైక్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో శేషంపల్లి వద్ద ముందు వెళ్తున్న బస్సును తప్పించబోతుండగా, ఎదురుగా అయిజ వైపు నుంచి వస్తున్న మరో బైక్ వేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఎదురెదురుగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ఒక బైక్‌పై ప్రయాణిస్తున్న చిన్న తాండ్రపాడుకు చెందిన మహేష్ మరియు ఎదురుగా వస్తున్న మరో బైక్‌పై ఉన్న నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా గ్రామానికి చెందిన లోకేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో బైక్‌పై ఉన్న కిరణ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మల్దకల్ ఎస్సై శ్రీహరి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కిరణ్‌కుమార్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ ద్వారా అయిజ ఆసుపత్రికి గద్వాల్ కి కర్నూల్.తరలించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.