గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా బైక్లు ఢీకొని ఇద్దరు మృతి
మల్దకల్ – అయిజ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు గృహప్రవేశ కార్యక్రమం ముగించుకుని వస్తుండగా జరిగిన ప్రమాదం. జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. మల్దకల్.– అయిజ ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. మల్దకల్ మండలం శేషంపల్లి స్టేజ్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన కొంతమంది నీలిపల్లిలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరిగి బైక్పై వస్తున్నారు. ఈ క్రమంలో శేషంపల్లి వద్ద ముందు వెళ్తున్న బస్సును తప్పించబోతుండగా, ఎదురుగా అయిజ వైపు నుంచి వస్తున్న మరో బైక్ వేగంగా...