Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వెంకటాపూర్ గ్రామంలో వీబీ-జీఆర్‌ఏఎంజీ సైట్‌ను సందర్శించిన డీపీవో శ్రీకాంత్..

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:27 PM | Array
వెంకటాపూర్ గ్రామంలో వీబీ-జీఆర్‌ఏఎంజీ సైట్‌ను సందర్శించిన డీపీవో శ్రీకాంత్..

భాగంగా భద్రాచలం పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం
జోగులాంబ గద్వాల 31 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీకాంత్ వెంకటాపూర్ గ్రామంలో పర్యటించి, వీబీ-జీఆర్‌ఏఎంజీ సైట్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల తీరును క్షుణ్ణంగా పరిశీలించి, పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఉపాధి పనులకు సంబంధించి మరింతమంది కూలీలు రావలసిన అవసరం ఉందని, కనీసం 100 మంది కూలీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా జలశక్తి పనులు, ఫాం బండ్ నిర్మాణాలు, ప్రతి ఇంటి వద్ద విధిగా ఇంకుడు గుంతలు తవ్వుకోవడం మరియు బోర్వెల్ రీచార్జ్ (బోరు బావుల పునరుజ్జీవన) పనులు వంటి అన్ని జల సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వర్షపు నీటిని ప్రతి చుక్కను భూమిలోకి ఇంకింపజేసేలా గ్రామస్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మనోహర్, పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొని పనుల పురోగతిని డీపీవోకు వివరించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.