Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కార్మిక సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:27 PM | తాజావార్తలు Flash News
కార్మిక సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి

ఏటీసీ లకు నిధుల మళ్లింపును నిలిపివేయాలి
బిఆర్ టీ యు గద్వాల జిల్లా అధ్యక్షుడు గంజిపేట రాజు
జోగులాంబ గద్వాల 31 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల. : భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్ టీ యు గద్వాల జిల్లా అధ్యక్షుడు గంజిపేట రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ జి.గంగాధర్, జాయింట్ కమిషనర్ శ్యామ్ సుందర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరంలో బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన బీమా కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ద్వారా సుమారు రూ.150 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. కార్మికులకు నేరుగా ప్రయోజనం చేకూర్చాల్సిన బోర్డు నిధుల నుంచి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) కోసం సుమారు రూ.650 కోట్లు కేటాయించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బీమా కార్యకలాపాలను ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో విలీనం చేయడం వల్ల కార్మిక సంక్షేమ బోర్డు స్వతంత్రత దెబ్బతిని, దాని ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డు నిధులను ఇతర పథకాలకు మళ్లించకుండా, కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని స్పష్టం చేశారు. అలాగే,ప్రయోజనం లేని హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను నిలిపివేసి,కార్మికులకు ఉపయోగపడే ప్రత్యామ్నాయ వైద్య సేవలు అందించాలని కోరారు. బోర్డు లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, దానిని మరింత పటిష్టపరచి లక్షలాది మంది నిర్మాణ కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.