కార్మిక సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి
ఏటీసీ లకు నిధుల మళ్లింపును నిలిపివేయాలి బిఆర్ టీ యు గద్వాల జిల్లా అధ్యక్షుడు గంజిపేట రాజు జోగులాంబ గద్వాల 31 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల. : భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్ టీ యు గద్వాల జిల్లా అధ్యక్షుడు గంజిపేట రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ జి.గంగాధర్, జాయింట్ కమిషనర్ శ్యామ్ సుందర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరంలో బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన బీమా కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ద్వారా సుమారు రూ.150 కోట్ల నిధుల దుర్వినియోగం...