Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపడాలి

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:25 PM | తాజావార్తలు Flash News
విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపడాలి

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన అవసరం.
వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు వివరించాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.శుక్రవారం గద్వాల మండలం వీరాపూర్ గ్రామ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పరీక్షా ఫలితాలపై ఆరా తీశారు. విద్యార్థులు వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి అందుకు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలను తెలియజేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్న నైపుణ్యాలు అవసరమని, అందుకు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై తరచూ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం డ్రగ్స్, బెట్టింగ్, తదితర వ్యసనాలు యువతను పట్టిపీడిస్తున్నాయని ఇలాంటి వ్యసనాల బారిన విద్యార్థులు పడకుండా సమస్కారంతో కూడిన విద్యను అందజేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. చక్కగా చదివి మంచి స్థాయిలో స్థిరపడే వయసులో వ్యసనాల బారిన పడితే విద్యార్థుల భవిష్యత్తు మొత్తం దెబ్బతింటుందని, వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు మానసిక వేదన అనుభవించాల్సి వస్తుందన్నారు. కాబట్టి విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడేలా విద్యార్థులకు దిశా నిర్దేశం చేయాలన్నారు.

ఇటీవల నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఆయా సబ్జెక్టులపై ఆసక్తితో చదివేలా ప్రయోగపూర్వకంగా బోధించాలన్నారు. గతేడాది ఎస్ఎస్సి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన వారి కంటే ఈ ఏడాది పరీక్ష ఫలితాల్లో ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏకరూప దస్తులు, రాత, పాఠ్య పుస్తకాల కొరత లేకుండా అందజేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. గురుకులంలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని, తాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. గురుకులం వాష్రూమ్స్ శుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి వాకబ్ చేశారు. ప్రథమ చికిత్స కిట్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేయడమే కాక వారి రక్షణ విషయంలోనూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులను కలిసేందుకు వారి తల్లిదండ్రులకు అవకాశం కల్పించాలని సూచించారు. విద్యార్థులతో ఫోన్స్ ఉండడానికి వీల్లేదని, ఈ విషయంలో తగు పర్యవేక్షణ చేస్తుండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపడాలి - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.