విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపడాలి

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన అవసరం. వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి. వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు వివరించాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.శుక్రవారం గద్వాల మండలం వీరాపూర్ గ్రామ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పరీక్షా ఫలితాలపై ఆరా తీశారు. విద్యార్థులు వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రత్యేక...