Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జిల్లా కేంద్రంలోని పాఠశాలలలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:23 PM | తాజావార్తలు Flash News
జిల్లా కేంద్రంలోని పాఠశాలలలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం

జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. డీఎంహెచ్వో - డా. సంధ్యా కిరణ్మై, మరియు (CH&FW) ఆదేశాల మేరకు, డాక్టర్ ప్రదీప్ కుమార్ సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో పొగాకు రహిత యువత ప్రచార కార్యక్రమం (Tobacco-Free Youth Campaign – TFYC లో భాగంగ గద్వాల జిల్లా కేంద్రంలోని ZPHS, బాలుర మరియు మైనారిటీ బాలికల పాఠశాలల్లోని విద్యార్థులకు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగ విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం, ధూమపానం మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. చిన్న వయస్సులోనే పొగాకు అలవాట్లకు దూరంగ ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
పొగాకు రహిత యువత ప్రచార కార్యక్రమం (TFYC)ఈ ప్రచారంలో భాగంగ ప్రతిజ్ఞ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.పొగాకు రహిత విద్యాసంస్థల (ToFEI) ఏర్పాటును ప్రోత్సహిస్తూ, విద్యార్థులు పొగాకు వినియోగానికి దూరంగ ఉండేల పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
యువత ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది. పొగాకుకు దూరంగ ఉండండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.
ఇట్టి కార్యక్రమంలో సంబంధిత విద్యాసంస్థల అధ్యాపకుల బృందం మరియు జిల్లా ఇంచార్జ్ మీడియ ఆఫిసర్ హీర్యనాయక్, సూపర్వైజర్- షేకమ్మ, ANM- నవీన మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని పాఠశాలలలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.