Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చెకుముకి సంబరాలను జయప్రదం చేయాలి

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:20 PM | తాజావార్తలు Flash News
చెకుముకి సంబరాలను జయప్రదం చేయాలి

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, విజ్ఞానంపై ఆసక్తిని కలిగించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సంబరాలను జయప్రదం చేయాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి సేవాసమితి కార్యాలయం లో జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా నాయకులు బచ్చు పురుషోత్తంను మర్యాదపూర్వకంగా కలిసి చెకుముకి సంబరాల నిర్వహణ, వాటి ఉద్దేశాలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా బచ్చు పురుషోత్తం పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని విషయ పరిజ్ఞానంతో పాటు శాస్త్రీయ ఆలోచనా విధానం, ప్రశ్నించే తత్వం, పరిశీలనాశక్తి ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థుల్లో మూఢనమ్మకాలను తొలగించి, శాస్త్రీయ అవగాహనను పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక నిరంతర కృషి అభినందనీయమని తెలిపారు.
చెకుముకి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం, ప్రయోగాత్మక విద్యను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు సహకరించాలని జన విజ్ఞాన వేదిక నాయకులు కోరారు.
విద్యార్థులలో విజ్ఞాన వికాసానికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని బచ్చు పురుషోత్తంను కోరారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కలకుంట్ల సైదులు, కోశాధికారి డాక్టర్ క్రాంతి కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు గొల్లమూడి రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు దేవరశెట్టి నాగరాజు, గౌరవాధ్యక్షులు తల్లాడ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.