చెకుముకి సంబరాలను జయప్రదం చేయాలి
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, విజ్ఞానంపై ఆసక్తిని కలిగించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సంబరాలను జయప్రదం చేయాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి సేవాసమితి కార్యాలయం లో జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా నాయకులు బచ్చు పురుషోత్తంను మర్యాదపూర్వకంగా కలిసి చెకుముకి సంబరాల నిర్వహణ, వాటి ఉద్దేశాలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా బచ్చు పురుషోత్తం పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని విషయ పరిజ్ఞానంతో పాటు శాస్త్రీయ ఆలోచనా విధానం, ప్రశ్నించే...