Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికయ్యేందుకు చాగాపురం గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందం

Author
Posted By Telangana Vaartha
| 29 Oct 2026, 08:23 PM | తాజావార్తలు Flash News
ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికయ్యేందుకు చాగాపురం గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందం

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన బృందం గురువారం ఇటిక్యాల మండలంలోని చాగాపురం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగ్ రావు, గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ, సంబంధిత అధికారులు కేంద్ర అధికారులు హర్ష కుమార్ ఝా, నవీన్ శివ కు స్వాగతం పలికారు.ఉత్తమ గ్రామ పంచాయతీగా గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఎంపిక కావడానికి నిర్దేశించిన అర్హతలు, ప్రమాణాలకు అనుగుణంగా గ్రామంలో సిఎస్సి సెంటర్, ఆన్లైన్ సర్టిఫికెట్ ల జారీ గురించి మరియు చేపట్టిన అభివృద్ధి పనులు, పాఠశాల, అంగన్వాడీ, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలను కేంద్ర బృందం పరిశీలించింది.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ ముషాహిదా బేగం, డీపీఓ శ్రీకాంత్, ఐ సి డి ఎస్. సి డి పి ఓ. హిమాలత. ఎంపీడీవో రమాదేవి వివిధ శాఖల అధికారులు గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.