ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికయ్యేందుకు చాగాపురం గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందం

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన బృందం గురువారం ఇటిక్యాల మండలంలోని చాగాపురం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగ్ రావు, గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ, సంబంధిత అధికారులు కేంద్ర అధికారులు హర్ష కుమార్ ఝా, నవీన్ శివ కు స్వాగతం పలికారు.ఉత్తమ గ్రామ పంచాయతీగా గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఎంపిక కావడానికి నిర్దేశించిన అర్హతలు, ప్రమాణాలకు అనుగుణంగా గ్రామంలో సిఎస్సి సెంటర్, ఆన్లైన్ సర్టిఫికెట్ ల జారీ గురించి మరియు చేపట్టిన అభివృద్ధి పనులు, పాఠశాల, అంగన్వాడీ, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలను...