Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులు గడువు కంటే ముందే పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Author
Posted By Telangana Vaartha
| 29 Oct 2026, 08:19 PM | తాజావార్తలు Flash News
భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులు గడువు కంటే ముందే పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవంబర్ 15 నుంచి రాతి కట్టడాల పనులు ప్రారంభం

గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయం, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం

భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులు గడువు కంటే ముందే పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Additional Image

తెలంగాణ వార్త అక్టోబర్ 29 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పనులను వేగవంతం చేసిందని అన్నారు .

గురువారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ,జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి ఆలయం చుట్టూ జరుగుతున్న పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆర్ అండ్ బి, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. అధికారానికి యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ అభివృద్ధి పనులపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నామన్నారు.

బాసర నుంచి భద్రాచలం వరకు ప్రధాన ఆలయాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఆలయ పర్యాటక మార్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలంతో పాటు మార్గంలోని ఇతర ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భద్రాచలం ఆలయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, ఇదే వేగంతో పనులు కొనసాగితే నిర్దేశిత గడువు కంటే సుమారు పది రోజుల ముందుగానే పూర్తి చేయగలమనే విశ్వాసం ఉందని తెలిపారు .

ఇవి కూడా చదవండి

ఇప్పటికే కొన్ని స్లాబుల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రాతి కట్టడాలకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. నవంబర్ 15 నుంచి రాతి కట్టడాల పనులను ప్రారంభించి, వాటిని క్షేత్రస్థాయిలో ప్రతిష్ఠించే ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. మిగిలిన కాంక్రీట్ పనులతో పాటు మాడవీధులకు సంబంధించిన పనులను కూడా సమాంతరంగా కొనసాగిస్తామని చెప్పారు.

ఆలయం ఒకవైపు, నివాస ప్రాంతాలు మరోవైపు ఉండటంతో కొండపై రాతిని తొలగించే పనులను అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సి వస్తోందని మంత్రి వివరించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు 24 గంటల పాటు కష్టపడి పనిచేస్తూ ప్రాజెక్టు పురోగతికి కృషి చేస్తున్నారని అభినందించారు.

గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున, పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

భద్రాచలం పట్టణంలో స్థానిక వర్షాల కారణంగా వరదనీరు నిలిచిపోకుండా, సులభంగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు ముఖ్యమంత్రి, ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇందుకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని, ఆ పనులను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి, గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.


ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎండ్

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.