భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులు గడువు కంటే ముందే పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవంబర్ 15 నుంచి రాతి కట్టడాల పనులు ప్రారంభం గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయం, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం తెలంగాణ వార్త అక్టోబర్ 29 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పనులను వేగవంతం చేసిందని అన్నారు . గురువారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి పొంగులేటి...