Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అర్నాబ్ తుఫాన్ విపత్తులను ఎదుర్కోవడానికి సహాయక చర్యలు ముమ్మరం

Author
Posted By Telangana Vaartha
| 28 Oct 2026, 07:55 PM | తాజావార్తలు Flash News
అర్నాబ్ తుఫాన్ విపత్తులను ఎదుర్కోవడానికి సహాయక చర్యలు ముమ్మరం

ప్రమాదకర ప్రాంతాలు పరిశీలన

*భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట*మెడ్

అర్నాబ్ తుఫాన్ విపత్తులను ఎదుర్కోవడానికి సహాయక చర్యలు ముమ్మరం - Additional Image

తెలంగాణ వార్త అక్టోబర్ 28 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. 'అర్నాబ్' తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిల్లే ప్రాంతాలను గుర్తించి ఎన్టీఆర్ ఎఫ్ బృందం మరియు అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు.

ఇవి కూడా చదవండి

బుధవారం నాడు తన ఛాంబర్ లో భద్రాచలం డీఎస్పీ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందంతో ఒక సమన్వయ సమావేశాన్ని నిర్వహించి వరదలు, భారీ వర్షాలు మరియు ఇతర విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించారు.

సమావేశం అనంతరం, సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో భద్రాచలం డీఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందం, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) బృందం మరియు అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి, భద్రాచలంలోని ప్రమాదకర ప్రాంతాలను (vulnerable areas) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భారీ వర్షాలు మరియు వరదల సమయంలో ప్రజల భద్రతకు ఎటువంటి ముప్పు కలగకుండా ఉండేలా, ఈ బృందం ప్రమాదకర ప్రాంతాలను తనిఖీ తనిఖీ చేసి భద్రాచలం సబ్-డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా తనిఖీలు చేపట్టాలని, గుర్తించిన ప్రతి చోటా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి ప్రజల భద్రతను సునిశ్చితం చేయాలని సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎండ్

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.