Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మాట తప్పిన వ్యాపారులు రోడ్డెక్కిన రైతులు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 27 Oct 2026, 07:56 PM | తెలంగాణ Telangana
మాట తప్పిన వ్యాపారులు రోడ్డెక్కిన రైతులు

తిరుమలగిరి 28 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తాము పండించిన పంటలకు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధరలు రావడం లేదంటూ సోమవారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా సూర్యాపేట జనగామ రహదారిపై రాస్తారోకో చేసిన రైతులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన వ్యాపారులు రెండవ రోజైనా మంగళవారం నాడు మద్దతు ధర ఇవ్వకుండా గతంలో ఉన్న 2, 800 ధర ఇస్తామని అనడంతో ఆగ్రహించిన
రైతులు మంగళవారం మధ్యాహ్న0 ధర్నా కార్యక్రమం దిగారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము ధాన్యాన్ని తీసుకురాగా గతంలో 3,400 ఉన్న ధాన్యాన్ని ఒకేసారి 2,800 తగ్గించడంతో ఆందోళన చేశామని అదే రోజు 2850 రూపాయలు ధర కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారని చెప్పారు అధికారులు వ్యాపారులు ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం నాడు 50 రూపాయలు కలిపి ఇవ్వకుండా పాత ధరకే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు కానీ రైతులు చైతన్య0తో దెబ్బలు కొట్టిన తాము ఆందోళన విరమించే లేదని పట్టు పట్టడంతో పోలీసులు వెనక్కు తగ్గారు, అనంతరం నాగారం సిఐ నాగేశ్వరరావు తోపాటు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వై నరేష్ , నాగార సి ఐ నాగేశ్వర్ రావు ఎస్సై లు జీ వెంకట్ రెడ్డి చిరంజీవితో పాటు అర్వపల్లి ఎస్సై లు వ్యాపారవేత్త ల తో చర్చించి గతంలో హామీ ఇచ్చిన ప్రకారమే 50 రూపాయలు ధర కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.. ఆందోళన చేస్తున్న రైతులపై ఒక దశలో పోలీసులు లాఠీచార్జి చేసే యత్నంలో భాగంగా రైతులపై చేయి వేసుకొని ఒక ఇద్దరు రైతులను లాగారు దీంతో రైతులు పట్టుబాటి ఆందోళనలో దిగారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.