Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోలీస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 27 Oct 2026, 07:40 PM | తెలంగాణ Telangana
పోలీస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

తిరుమలగిరి 28 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
"పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని తిరుమలగిరి మున్సిపాలిటీ లో మంగళవారం భారీ బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. నాగారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా స్వయంగా అందులో పాల్గొని సిబ్బందిని ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యున్నత త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల సేవలు ఎప్పటికీ స్మరణీయమని కొనియాడారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకై అహర్నిశలు శ్రమించే పోలీసుల పాత్రను, వారి త్యాగాలను ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీని చేపట్టినట్లు వివరించారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి నాగారం ఎస్సై చిరంజీవి అర్వపల్లి ఎస్సై మధు పోలీస్ సిబ్బంది , స్థానిక పౌరులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.