పోలీస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
తిరుమలగిరి 28 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ "పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని తిరుమలగిరి మున్సిపాలిటీ లో మంగళవారం భారీ బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా స్వయంగా అందులో పాల్గొని సిబ్బందిని ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యున్నత త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల సేవలు ఎప్పటికీ స్మరణీయమని కొనియాడారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకై అహర్నిశలు శ్రమించే పోలీసుల పాత్రను, వారి త్యాగాలను ప్రజల్లో అవగాహన...