Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 26 Oct 2026, 09:48 PM | తెలంగాణ Telangana
తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలి

తిరుమలగిరి 27 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో జైలు బాధితుడు అబ్దుల్ గఫార్ ఖాన్ నిర్వహణలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో తిరుమలగిరి మండలంలో రోడ్డెక్కి పోరాడి, లాఠీ దెబ్బలు తిని, అరెస్టులు ఎదుర్కొని, పోలీస్ కేసులు ఎదుర్కొని, జైలు జీవితం అనుభవించిన 12 మంది తెలంగాణ ఉద్యమ సహచరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను, భవిష్యత్తును సైతం పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొన్నామని తెలిపారు. ఉద్యమ సమయంలో తమపై నమోదైన కేసులు, అరెస్టులు, జైలు జీవితం కారణంగా నేటికీ అనేక మంది ఉద్యమకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగాలు, ఇతర అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో పోలీస్ వెరిఫికేషన్, కేసులు, క్లియరెన్స్ తదితర అంశాల కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని, ఉద్యమ సమయంలో తమ కుటుంబాలు కూడా ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము చేసిన పోరాటాన్ని గుర్తించి, ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు కోరారు.ఈ సందర్భంగా తిరుమలగిరి మండలానికి చెందిన ఉద్యమకారుల పోరాట చరిత్రను సమగ్రంగా నమోదు చేసి, ఉద్యమ సమయంలో వారు ఎదుర్కొన్న అరెస్టులు, కేసులు, లాఠీచార్జీలు, జైలు జీవితం, కుటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఉద్యమంలో వారి పాత్ర తదితర అంశాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వపరంగా గుర్తింపు కల్పించి న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని కోరాలని సమావేశంలో నిర్ణయించారు.తెలంగాణ కోసం చేసిన మా పోరాటానికి అధికారిక గుర్తింపు, మా కుటుంబాల భవిష్యత్తుకు భరోసా, మా త్యాగాలకు గౌరవం కల్పించాలన్నదే మా ప్రధాన డిమాండ్” అని ఉద్యమకారులు స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి తెలంగాణ ఉద్యమకారుడిని గుర్తించి, వారి పోరాటాన్ని అధికారికంగా నమోదు చేసి, ప్రభుత్వపరంగా తగిన న్యాయం జరిగే వరకు ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో జైలు బాధితులు వడ్లకొండ గంగాధర్, కొత్తగట్టు యాకయ్య, గడ్డం ఉదయ్, తోట ఉపేందర్, గొడిశాల శ్రీను, ములుగురి రామకృష్ణ, ఏపూరి నరేష్, తోట నాగరాజు, వేల్పుల వీరనారి, సంకెపల్లి దయాకర్, పాలాభిందెల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.