తెలంగాణ మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలి
తిరుమలగిరి 27 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జైలు బాధితుడు అబ్దుల్ గఫార్ ఖాన్ నిర్వహణలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో తిరుమలగిరి మండలంలో రోడ్డెక్కి పోరాడి, లాఠీ దెబ్బలు తిని, అరెస్టులు ఎదుర్కొని, పోలీస్ కేసులు ఎదుర్కొని, జైలు జీవితం అనుభవించిన 12 మంది తెలంగాణ ఉద్యమ సహచరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను, భవిష్యత్తును సైతం పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొన్నామని తెలిపారు. ఉద్యమ సమయంలో తమపై...