Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఇటిక్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు పైకాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం

Author
Posted By Telangana Vaartha
| 26 Oct 2026, 08:16 PM | తాజావార్తలు Flash News
ఇటిక్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు పైకాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం

పట్టభద్రులందరూ ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలి.
డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ .

జోగులాంబ గద్వాల 26 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాలమండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ మాట్లాడుతూ..!

_ ఇటిక్యాల మండలంలోనిపట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా గ్రామస్థాయి నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు._
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు కావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమని తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మాట్లాడుతూ, వర్షాభావ ప్రభావం ఒక్క అలంపూర్ నియోజకవర్గానికే పరిమితం కాలేదని, రాష్ట్రంతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని సంపత్ కుమార్ పేర్కొన్నారు. రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
కరువు పరిస్థితులపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత కరువుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు, పట్టభద్రులు వాస్తవాలను పరిశీలించి, రాజకీయ నాయకుల ప్రకటనలను వివేచనతో అర్థం చేసుకోవాలని సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నవంబర్ 6వ తేదీలోపు ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసి, సంబంధిత మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయానికి అవసరమైన పత్రాలను అందజేయాలని సూచించారు.
పట్టభద్రులు విద్యావంతులైనప్పటికీ, ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా గ్రామస్థాయి నాయకులు సహకరించాలని ఆయన కోరారు.

_ఈ కార్యక్రమంలో ఇటిక్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యు ఆంజనేయులు , డీసీసీ అధ్యక్షుడు మధు నాయుడు, అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రుక్మాంగ రెడ్డి సాతర్ల మాజీ సర్పంచ్ జై చంద్రారెడ్డి ఇటిక్యాల మండలం మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లా బకాస్,
మునగాల సర్పంచ్& ఇటిక్యాల మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు బి ఎల్ ఏ లు తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.