ఇటిక్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు పైకాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం

పట్టభద్రులందరూ ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలి. డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ . జోగులాంబ గద్వాల 26 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాలమండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ మాట్లాడుతూ..! _ ఇటిక్యాల మండలంలోనిపట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా గ్రామస్థాయి నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి...