Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ ఆర్టీసీ కార్మికుల గేట్ ధర్నా

Author
Posted By Telangana Vaartha
| 26 Oct 2026, 08:15 PM | తాజావార్తలు Flash News
కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ ఆర్టీసీ కార్మికుల గేట్ ధర్నా

గద్వాల:-మణుగూరు డిపో కండక్టర్ ప్రవళ్లికపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంప్లాయిస్ యూనియన్ గద్వాల్ డిపో కార్మికులు సోమవారం గేట్ ధర్నా నిర్వహించారు. ప్రవళ్లికకు మెరుగైన వైద్యం అందించి, న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆమెను బస్సు నుంచి తోసివేసిన ప్రయాణికురాలిని వెంటనే అరెస్టు చేసి, నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రవళిక కు యాజమాన్యం 20 లక్షలు చెల్లించాలని నిబంధనల ప్రకారం కండక్టర్ ఉద్యోగం చేయలేని పక్షంలో ఓడి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరమేశ్వరయ్య , డిపో అధ్యక్షులు గాల్ రెడ్డి, రామ్నాథ్, ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, ఎస్సీ ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి కిష్టన్న , మహిళా ప్రతినిధులు వరలక్ష్మి, లక్ష్మి, పరమేశ్వరి, నవీన్ కుమార్, గ్యారే సిబ్బంది శాంతిరాజు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.